Telugu

దర్బార్ ట్రైలర్ … స్టైల్ తప్ప ఏముంది?

darbar-telugu-official-trailer-rajinikanth-a-r-murugadossసూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తరువాత పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘దర్బార్’. క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసింది చిత్రబృందం.

అయితే ట్రైలర్ నిరాశపరచిందనే చెప్పుకోవాలి. రజినీ స్టయిల్, ఎలేవేషన్ షాట్స్ బానే ఉన్నా మిగతా భాగం నిరాశపరచింది. కథలో పెద్దగా దమ్ము ఉన్నట్టుగా అనిపించడం లేదు. స్టయిల్ వరకూ అభిమానులను ఆనందపరచినా అది సినిమాను కాపాడగలదా అంటే అనుమానమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రజినీ సినిమాలలో స్టయిల్ కు లోటు లేకుండానే చూసుకుంటున్నారు దర్శకులు.

ADVERTISEMENT

కథ పార్టు వచ్చే సరికి ట్రైలర్ కట్ కూడా బాలేదు. మొత్తం సెట్ అప్ చూస్తే ఎటువంటి కొత్తదనం కనిపించడం లేదు. సునీల్ షెట్టి గెట్ అప్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. నయనతార బానే ఉంది. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ నిరాశపరిచాయి. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. వచ్చే నెల 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో సినిమా విడుదల అవుతుంది.

తమిళంలో రజినికి సోలో రిలీజ్ వస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే తెలుగులో మాత్రం సంక్రాంతి సందర్భంగా పోటీ గట్టిగానే ఉండబోతుంది. కాకపోతే పండగ సీజన్ లో విడుదల అయ్యే మొదటి సినిమా కాబట్టి కొంత ఎడ్వాంటేజ్ ఉండొచ్చు. ఆ తరువాత ఎంతమేర థియేటర్లను నిలబెట్టుకుంటారు అనేది చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఎవరి బాబు నీళ్ళవి? నిజమే ఎవరి బాబువి కావు!

తెలంగాణలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్‌ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ…

27 minutes ago

CBN, PK Meet Again Over MPTC, ZPTC Seat Sharing

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan have reportedly…

39 minutes ago