
దర్శకుడిగా ఎదగాలన్న ఓ యువకుడు సాగించే జీవితగాధే ఈ సినిమా కధగా కనపడుతోంది. గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన “ఒక విచిత్రం” సినిమాలో పోలిన ఒకటి రెండు సన్నివేశాలు, ఈ ట్రైలర్ లో కనపడుతున్నాయి. ప్రవీణ్ అందించిన విజువల్స్, సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లతో పాటు హీరోయిన్ గా నటించిన ఈషా రబ్బా లుక్ ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు.
అయితే ఈ సినిమా ఏ జోనర్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తీసారో అన్న విషయం మాత్రం మిస్ అయ్యింది. ‘కుమారి 21ఎఫ్’ కేవలం యూత్ ను మాత్రమే టార్గెట్ చేసారని స్పష్టం కాగా, ఇందులో ఆ స్పష్టత మిస్సయింది. బహుశా ఇదే అనుభూతిని డైరెక్టర్ జక్కా హరిప్రసాద్ కూడా చవిచూసారో ఏమో గానీ, ‘ఫుల్ ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూడొచ్చు’ అంటూ సెలవిచ్చారు.
Pakistan have made several changes to their Test team during the England series, and former…
Allari Naresh is ready to entertain audiences worldwide on September 4th with his upcoming socio-fantasy…