
ఆలయ పూజారుల ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత దాసరి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “నాకు సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నా చాలా అభిమానం. సిఎం జగన్మోహన్ రెడ్డి నా విధేయతని గుర్తించి టీటీడీలో నాకు ఈ పదవి కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.
కొన్ని రోజుల క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా శపధం, వ్యూహం అనే రెండు సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలకు ముందు విడుదల కాబోయే ఆ రెండు సినిమాలని దాసరి కిరణ్ కుమారే నిర్మించబోతున్నారు. బహుశః అందుకు ప్రతిగానే ఆయనకి ఈ పదవి లభించి ఉండవచ్చు.
ఇప్పటికే టీటీడీ బోర్డు వైసీపీ నేతలతో నిండిపోయింది. ఇక తిరుమలపైకి మంత్రులు, ఎమ్మెల్యేల దండయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తరచూ అనేకమంది అనుకహృలను వెంటబెట్టుకొని వచ్చి ఆలయంలో దూరిపోయి హడావుడి చేస్తూనే ఉన్నారు. తిరుమలకి వచ్చే ఆదాయం నుంచి కొంత అన్యమతాలకు కేటాయింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోట్లాది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం చాలా బాధాకరమే.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…