Telugu

ఆన్ లైన్ వాడుతున్నారా… జస్ట్ వన్ మినిట్…!

క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఒక్క క్ష‌ణం. ఇక‌ ముందు ఆన్‌ లైన్‌ లో వ‌స్తువులు కొనుగోలు చేసేముందు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించండి. లేదంటే కేవలం ఆరంటే ఆరు సెక‌న్ల‌లో మీ కార్డులోని స‌మ‌స్త స‌మాచారాన్ని హ్యాక‌ర్లు త‌స్క‌రించే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ మాట‌న్న‌ది మ‌రెవ‌రో కాదు… బ్రిట‌న్‌లోని న్యూకేజిల్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు.

డెబిట్‌, క్రెడిట్ కార్డుల వాడ‌కంలోని లోపాలపై అధ్య‌య‌నం చేసిన వారు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసానికి గుర‌య్యే మార్గాల‌ను బ‌య‌టపెట్టారు. త‌ప్పుడు సమాచారంతో హ్యాక‌ర్లు చేసే ప‌లు ప్ర‌య‌త్నాల‌ను వీసా వ్య‌వ‌స్థ కానీ, బ్యాంకులు కానీ ప‌సిగ‌ట్ట‌లేక‌పోతున్నాయ‌ని ప‌రిశోధ‌న‌కారులు పేర్కొన్నారు. దీంతో స్వ‌యంచాలిత స‌మాచారంతో కార్డుల్లోని స‌మాచారాన్ని హ్యాక‌ర్లు దొంగిలించే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు.

ADVERTISEMENT

వెబ్‌ సైట్ల‌లో ప‌లుమార్లు ప్ర‌య‌త్నించ‌డం ద్వారా కావాల్సిన స‌మాచారాన్ని తెలుసుకోగ‌లుగుతున్నారని, కేవ‌లం ఆరు సెక‌న్ల‌లోనే కావాల్సిన సమాచారంపై ఓ అంచ‌నాకు వ‌చ్చేస్తున్నార‌ని వారు వివ‌రించారు. చిన్న ల్యాప్‌ టాప్‌, దానికో నెట్ కనెక్ష‌న్ ఉంటే హ్యాక‌ర్ల‌కు దొరికిపోయే అవ‌కాశం మ‌రింత ఎక్కువ‌ని వారు పేర్కొన్నారు. ఒకే కార్డుతో త‌ప్పుడు స‌మాచారంతో ప‌లుమార్లు ఆన్‌లైన్ కొనుగోళ్లు జ‌రుపుతున్న‌ప్ప‌టికీ దానిని బ్యాంకులు గుర్తించ‌లేక‌పోతున్నాయ‌ని తెలిపారు.

పిన్‌ నంబ‌ర్‌, గ‌డువు తేదీ, కార్డు నంబ‌రు త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకునేందుకు హ్యాక‌ర్లు చేసే ప్రయ‌త్నాల‌ను బ్యాంకింగ్ వ్య‌వస్థ గుర్తించ‌లేక‌పోతోందన్నారు. ఒక్కో వెబ్‌ సైట్ ఒక్కో ర‌కంగా స‌మాచారాన్ని తెలుసుకుని నిర్ధారించ‌డం కూడా హ్యాక‌ర్ల‌కు అనుకూలంగా మారుతోంద‌ని వివరించారు. ప్రస్తుతం ఇండియాలో ఆన్ లైన్ వ్యవహారం అనివార్యం కావడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

హరీష్ రావు భార్యకు సవాల్ విసిరిన కవిత…

బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయం మొదలుపెట్టిన సంగతి…

3 minutes ago

After Two Setbacks, All Eyes Are on Kaaka

KVN Productions has quickly established itself as one of the ambitious production houses in South…

19 minutes ago