
తిరుపతిలోని 10 ఖాతాల్లో సగటున 6 కోట్ల చొప్పున జమ కాగా, ఆఖరి రోజున ఒక కోటి కన్నా అధిక మొత్తాన్ని బ్యాంకుల్లో వేసుకున్న వారిలో 115 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు ‘గరీబ్ కల్యాణ్ యోజన’ కింద పన్ను చెల్లించేందుకు అంగీకరించి లేఖలు ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గడచిన ఏడాది కాలంలో తన ఖాతాలో 11 వేలు మాత్రమే జమ చేసిన తిరుపతిలోని ఓ చిరు వ్యాపారి ఏకంగా 50 లక్షలను జమ చేసినట్టు అధికారులు గుర్తించారు.
కాగా, నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకు శాఖల్లో దాదాపుగా 1.48 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం కరెన్సీలో దాదాపుగా 10 శాతం వాటా అన్న మాట. దేశ వ్యాప్తంగా దాదాపుగా 14 నుండి 15 లక్షల కోట్ల మధ్యలో పాత నోట్లు డిపాజిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి గానీ, కేంద్ర ప్రభుత్వం నుండి గానీ అధికారిక ప్రకటన వెల్లడికానుంది.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…