
గతంలో ‘సశేషం, భూ’ వంటి విలక్షణ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా దర్శనమిస్తోంది. దేవిశ్రీప్రసాద్ టైటిల్ డిజైన్ తో పాటు రెండు కాళ్ళు కనపడుతున్న పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. హ్యాట్రిక్ హార్రర్ సినిమాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ హీరోలు, మరో ప్రముఖ హీరోయిన్ కూడా నటిస్తున్నారట.
అయితే తారాగణం విశేషాలను బయటపెట్టకుండా మరింత ఆసక్తిని పుట్టించే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కధాంశంతో ఈ సినిమాను తెరకేక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో అయినా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ను కిషోర్ చాటిచెప్తారో లేదో చూడాలి.
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…
కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు…