Telugu

వర్మ ఎక్కడ ఏరుతున్నారో… “వంగవీటి” మురళీ సూపర్..!

మనసు సినిమా తీస్తే రాంగోపాల్ వర్మ ఇప్పటికీ సంచలనకరమైన సినిమాలను తీస్తారని నమ్మే అభిమానులు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. వర్మ టాలెంట్ పై అంత నమ్మకం ఉంటుంది మరి. బహుశా దీనినే మరోసారి నిరూపించే క్రమంలో వర్మ ఉన్నారేమోనని సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ వర్గీయులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT

తెలుగు నాట తన చివరి చిత్రంగా ప్రకటించిన రాంగోపాల్ వర్మ “వంగవీటి” సినిమా ప్రచారం సృష్టించిన సంచలనం తెలిసిందే. టైటిల్ ప్రకటించిన నాటి నుండి పాటలు విడుదల చేసిన వరకు వివిధ సందర్భాలలో “వంగవీటి” విశేషాలతో వర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ ఎంపిక వర్మ మార్క్ ప్రతిభకు నిదర్శనంగా సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు.

ఇప్పటికే వంగవీటి రాధ, రంగాల ఫస్ట్ లుక్ లను విడుదల చేసిన వర్మ, తాజాగా దేవినేని మురళీ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ‘ఔరా…’ అనిపించుకున్నారు. దాదాపు దేవినేని మురళీ పోలికలతో ఈ “వంగవీటి” సినిమాలోని మురళీ దర్శనమివ్వడం పలువురికి అవాక్కయ్యేలా చేస్తోంది. గతంలో రాధ, రంగా పాత్రల ఎంపిక సందర్భంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. వీరందిరినీ… ఎక్కడ వెతికి పట్టుకుంటున్నారో గానీ… “వంగవీటి” సినిమాలో నిజమైన మురళీ, రాధ, రంగాలు దర్శనమిచ్చేలా కనపడుతున్నారు.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Tabu Gets Birthday Love, But SlumDog Has No Date!

The team of SlumDog – 33 Temple Road has wished Tabu on her birthday by…

39 minutes ago

నాన్నకు ప్రేమతో… నారా లోకేష్‌

సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూర్చొని అన్ని విషయాలు చర్చించుకొని మున్సిపల్ ఎన్నికలలో కూటమిని…

41 minutes ago