Telugu

పవన్ కళ్యాణ్ బాబు గురించి అన్న మాట నిజమైతే జగన్ సంగతో?

వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకుల మాటలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఏ విషయమైనా వారికి కావాల్సినట్టుగా మార్చుకుంటారు. తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఇటువంటి వ్యాఖ్యే చేశారు. రానున్న ఎన్నికల్లో డబ్బు గుమ్మరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్‌ చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లు దించారంటూ పవన్‌ కల్యాణే చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చంద్రబాబు దోస్త్ ఏమో కానీ ఇప్పుడు కాదు. ఆయన విమర్శలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ వారి విమర్శలు ఒకటే. ఆ విషయం పక్కన పెడితే జగన్ మోహన్ రెడ్డి మీద కూడా పవన్ కళ్యాణ్ చాలా ఆరోపణలు చేశారు. చంద్రబాబు మీద చేసిన ఆరోపణ నిజమైతే అవి కూడా నిజమే కదా? జగన్ మీద చేసిన ఆరోపణలన్నీ నిజమని వైకాపా నాయకులు ఒప్పుకుంటారు. అంతెందుకు మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్న ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ మీద చాలా ఆరోపణలు చేశారు.

ADVERTISEMENT

ఆ విషయం సంగతి కూడా చెప్పాలి కదా? చంద్రబాబు గురించి తాము విమర్శలు చేస్తే ప్రజలు నమ్మడం లేదని పవన్ కళ్యాణ్ ను అడ్డు పెట్టుకుని విమర్శలు చేస్తున్నారా? ఈ ఎన్నికలు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికు, చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, చంద్రబాబు డబ్బుకు, రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జగన్ దగ్గర డబ్బు లేదా? లేక ఉన్నా తీసి ఖర్చుపెట్టారా? ఆ విషయంపై క్లారిటీ లేదు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ICE Approves, University Denies F1 CPT Amazon Offer?

A student on an F-1 visa secured an internship with Amazon, but the opportunity soon…

19 minutes ago

Vaazha 2 Review: Packed with Youth Connect

BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…

6 hours ago