
రెవెన్యూ, మున్సిపల్ వ్యవస్థలకి సమాంతరంగా సచివాలయ వ్యవస్థని, వాటికి అనుబందంగా లక్షలాది వాలంటీర్లను నియమించడం ద్వారా రెవెన్యూ, మున్సిపల్ వ్యవస్థలను, వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది అధికారులు, ఉద్యోగులను నిర్వీర్యం చేస్తున్నట్లవుతోంది. ఉదాహరణకి మంత్రి ధర్మాన చెప్పిన్నట్లు గ్రామ, వార్డు సచివాలయాలలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందాలాది రిజిస్ట్రార్ కార్యాలయాలు… వాటిలో అధికారులు, సిబ్బంది ఏం చేయాలి?
ఇప్పటికే ఇంటిపన్ను, చెత్తపన్ను చెల్లింపుల విషయంలో, ఇళ్ళ ప్లాన్ అప్రూవల్ వంటి పనుల కోసం ప్రజలు మున్సిపల్, సచివాలయాల మద్య ప్రదక్షిణాలు చేయవలసివస్తోంది. రెండు సమాంతర వ్యవస్థలు పనిచేస్తుండటంతో ఏ పనులు ఎక్కడ జరుగుతాయో తెలీని పరిస్థితి. ఇప్పుడు సచివాలయాలలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్స్ చేస్తే వాటికి చట్టబద్దత ఉంటుందా?లేదా అందుకోసం ప్రజలు మళ్ళీ రిజిస్ట్రార్ ఆఫీసులకి వెళ్ళి రిజిస్ట్రార్ సంతకం, ముద్ర వేయించుకోవాలా?
విద్యా వ్యవస్థలో ప్రక్షాళన పేరుతో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ బోధనా విదానం ప్రవేశపెట్టడం వాటి కోసం విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయడం వంటి ప్రయోగాలకు ఫలితాలు రావడానికి సమయం పడుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ ఈ ఏడాది వార్షిక పరీక్షలలోనే ఈ ప్రయోగ ఫలితాలు కనబడబోతున్నాయి.
సంస్కరణలు, ప్రక్షాళన పేరుతో సక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వ వ్యవస్థలకు సమాంతర వ్యవస్థలు సృష్టిస్తూ ప్రభుత్వమే ఈవిదంగా గందరోగోళం సృష్టిస్తుంటే, ఒక్కో వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది.
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…
The promotional materials for Nitesh Tiwari’s Ramayana are back in the headlines again. While the…