
ఈ క్రమంలో నిన్న జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో విజయం సాధించిన ధోనీ సేన కప్ ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ తో ధోనీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లకు సారధ్యం వహించిన కెప్టెన్ గా ధోనీ రికార్డు పుటలకెక్కాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉంది. తాజాగా రికీ రికార్డును ధోనీ సమం చేశాడు.
మొత్తం 324 మ్యాచ్ ల్లో టీమిండియాకు ధోనీ సారధ్యం వహించాడు. వీటిలో 60 టెస్టులు, 194 వన్డేలు, 70 టీ20 మ్యాచ్ లున్నాయి. విజయాల శాతంతో పాంటింగ్ తో సరితూగడం ఏ కెప్టెన్ కు సాధ్యమయ్యే విషయం కాదు గానీ, ఆడిన మ్యాచ్ లతో అయినా మ్యాచ్ అవడం ధోని సాధించిన విజయమే అనుకోవాలి.
#AK47: Familiar, Fun First Half Familiar family fun with Venky in his element. His natural…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…