
కానీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తే మాత్రం… మహా గొప్ప విజయంగానే భావించాల్సి ఉంటుంది. నోట్ల రద్దు నిర్ణయం వలన దాదాపుగా 20-30 శాతం వరకు కలెక్షన్స్ తగ్గాయని స్వయంగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పిన పరిస్థితి. అయితే ఆ డేట్ మిస్ అయితే మరొక అవకాశం లేక విడుదల చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. అంటే సాధారణ పరిస్థితులలో అయితే మరో 10, 15 కోట్లు ‘ధృవ’ ఖాతాలో చేరి ఉండేవని అల్లు అరవింద్ అంచనా. ‘ధృవ’కు లభించిన టాక్ ప్రకారం చూస్తే, ఖచ్చితంగా అది వాస్తవం అనిపించక మానదు.
చెర్రీ నటించిన సినిమాలలో ‘మగధీర’ సినిమా తర్వాత ‘ధృవ’ చిత్రానికే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రజల దగ్గర డబ్బులు లేకపోయినా 50 కోట్లతో పట్టం కట్టారు. ముఖ్యంగా చెర్రీకి ఇప్పటివరకు ‘మైనస్’ మార్కెట్ గా ఉన్న ఓవర్సీస్ లో తొలి 1 మిలియన్ మార్క్ ను ‘ధృవ’ ద్వారా నమోదు చేయించుకోగలిగారు. అందుకే ఏపీ నుండి యుఎస్ వరకు ఉన్న ప్రేక్షకులందరికీ ‘సెల్యూట్’ చేసేందుకు రామ్ చరణ్ ఈ రోజు హైదరాబాద్ లో చిత్ర యూనిట్ తో కలిసి తన అనుభూతులను మీడియా వర్గాలతో పంచుకోబోతున్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…