పుకార్లకు “డిక్టేటర్” స్వస్తి! బాబు ల్యాండ్ అవుతున్నాడు!

2016 సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల సంఖ్య పెరగడంతో బరిలో నుండి బాలయ్య తప్పుకున్నాడని, ఫిబ్రవరిలో రావడానికి సిద్ధమవుతున్నాడని ఇటీవల పుకార్లు షికారు చేసాయి. అయితే అలాంటి వార్తలకు చెక్ పెడుతూ అనుకున్న సమయానికే జనవరి 14వ తేదీనే “డిక్టేటర్” రూపంలో బాలయ్య బాబు ధియేటర్లలో ల్యాండ్ అవబోతున్నాడు.

ఇప్పటివరకు బ్యాలెన్స్ వున్న ఐటెం సాంగ్ చిత్రీకరణ నేటితో పూర్తయ్యింది. శ్రద్ధా దాస్, ముమైత్ ఖాన్ వంటి హాట్ భామలు ఈ పాటలో ఆడిపాడారు. ఇటీవల విడుదలైన ఆడియోకు అంతంత మాత్రపు స్పందనే రావడం, అలాగే ధియేటిరికల్ ట్రైలర్ ఆకట్టుకోకపోవడంతో “డిక్టేటర్”పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అయితే, ‘లక్ష్యం, లౌక్యం’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం సినిమాను గట్టెక్కిస్తుందని అభిమానులు ఆశగా ఉన్నారు.

ADVERTISEMENT

“డిక్టేటర్” విడుదల తేదీ కూడా ఖరారు కావడంతో ఇక సంక్రాంతి సినిమాల పోటీ రంజుగా మారనుంది. వరుసగా మూడు రోజుల్లో మూడు చిత్రాలు విడుదల కానుండడంతో సినీ ప్రేక్షకులకు ఈ ఏడాది నిజమైన సంక్రాంతి రానుంది. మరి ‘విజేత’ ఎవరవుతారో..? ఎనీ గెస్..!

Share
Published by

Recent Posts

What To Watch on OTT This Week?

The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…

10 minutes ago

Players Discriminated Against by Selectors? Dhawan Speaks Out

Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…

40 minutes ago