
జగన్ పాదయాత్ర లో పాటలు, ఆయన మాట్లాడుతున్న మాటలు అన్ని వ్యక్తిగతంగా ఆయన్ని ఆయనని పొగుడుతూ వై యస్ ఆర్ ని పొగుడుతూ ఉన్నాయి. అదే విధంగా ఎక్కువ కాలం ప్రభుత్వం పై విమర్శలు, చంద్రబాబు నాయుడుకి శాపనాకారాలు పెట్టడానికే వినియోగించారు. అయితే చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో ఆయన తీరు మొత్తానికి వేరు.
ఆయన ఎక్కువ కాలం ప్రజలతో మమేకం కావడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. పాదయాత్ర పాటలు కూడా అలానే ఉండేవి. ఇప్పుడు ఏమిట్రా అంటే ముఖ్యమంత్రి కావడం మా లక్ష్యం, ఆ లక్ష్యం కోసం మీరంతా కూడా నిద్రాహారాలు మాని కష్టపడాలి అన్నట్టు ఉంది జగన్ వ్యవహారం అని విశ్లేషకుల అభిప్రాయం.
రానున్న రోజులలో పాదయాత్ర జరుగుతున్నా తీరు పై ఆ పార్టీ నాయకులూ ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని వస్తున్నా ఫీడ్ బ్యాక్ బట్టి మార్పులు చేస్కోవడం బెటర్. ఏ రాజకీయనాయకుడైన పాదయాత్ర చేసేది రాజకీయ లబ్ది కోసమే అయినాసరే ప్రజలకు కనెక్ట్ అయ్యే పద్దతి కచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ పద్దతి ఎంత ఫాస్ట్ గ తెలుసుకుంటే జగన్ కు అంత మంచిది.
Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…
దేశంలో, రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన రంగాలలో పర్యాటక రంగం కూడా ఒకటి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో…