
దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అయోమయానికి గురయ్యారు. అయితే దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక వచ్చే ఏడాది తీరుతోంది. పవన్ కళ్యాణ్ డేట్లు ఖరారు కావల్సివుంది, అది కాగానే పూర్తి వివరాలు చెబుతా,” అని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
దానితో సినిమా ఖరారు అయినట్టే, ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం తేలాల్సి ఉంది. హిందీలో విజయవంతమైన ‘పింక్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.
ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట.
2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి తరువాత ప్రజా క్షేత్రంలో కనిపించని కేసీఆర్, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లో…
YS Jagan Mohan Reddy seems to have found his biggest election issue even before the…