Telugu

మరోమారు దేశ రాజకీయాలలోకి కేసీఆర్…

2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి తరువాత ప్రజా క్షేత్రంలో కనిపించని కేసీఆర్, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లో కూడా ఉనికి చాటుకోలేని కేసీఆర్, సొంత కుమార్తె కవితే బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనా మీద, నాటి ప్రభుత్వ పెద్దల మీద అవినీతి ఆరోపణలు చేస్తూ వారిని తెలంగాణ ను దోచుకున్న దొంగలుగా చిత్రీకరిస్తున్నా,

చివరికి కేసీఆర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా నిర్మించిన కాళేశ్వరం లో ఆయన పైనే అవినీతి ఆరోపణలు, విచారణ కమిటీలు సిద్ధమైనా రాష్ట్ర రాజకీయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదు అనేలా మౌన ముద్రలో ఉన్న కేసీఆర్ దేశ రాజ్కియాలలోకి అడుగు పెట్టె సమయం ఆసన్నమయింది అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనలు చేస్తున్నారు.

ADVERTISEMENT

2023 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ ఉండే తన ప్రాంతీయ పార్టీని జాతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చి రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు కేసీఆర్ అంటూ అటు పొరుగు రాష్ట్రమైన ఏపీతో పాటుగా ఇటు కర్ణాటక లో పర్యటించారు.

ఆయా రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పార్టీ పేరుతో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసారు. కాంగ్రెస్, బీజేపీ లకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని, ఆ ప్రత్యామ్నాయానికి తానే నాయకుడు అంటూ కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ ప్రచారానికి తగ్గట్టే బిఆర్ఎస్ నాయకులు కూడా దేశ రాజకీయాలలో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారు అంటూ జబ్బలు చరుచుకున్నారు.

చివరికి కట్ చేస్తే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ ఓటమిపాలైయి దేశ రాజకీయాలలో చక్రం తిప్పాల్సిన నేత కాస్త ఫామ్ హౌస్ లో సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు ఒక పార్టీ అధినేతగా కేసీఆర్ తన పార్టీ క్యాడర్ కి లీడర్లకు అవసరమైన సమయంలో కూడా అందుబాటులోకి రాలేదు.

మాజీ ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యల మీద గళమెత్తలేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటానికి ముందుకు రాలేదు. చివరికి తన సంతానం మధ్య రాజకీయ ఆధిపత్య పోర్టులు జరిగినా, దాని కారణంగా పార్టీ ప్రజల ముందు దోషిగా నిలిచినా కేసీఆర్ పెదవి విప్పలేదు, ప్రజలకు జవాబుదారి చెప్పలేదు.

అటువంటి కేసీఆర్ రాబోయే రోజులలో రాష్ట్ర రాజకీయాలలో కీలక అపాత్ర పోషించి ఇక్కడ బిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపడ్తాడంతో పాటుగా దేశ రాజకీయాలలో కూడా చక్రం తిప్పగలరా.? దేశ రాజకీయాలలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ లకు ప్రత్యామ్నాయంగా కొత్తగా కాక్రోచ్లు పుట్టుకొచ్చాయి.

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కాక్రోచ్లు చేస్తున్న రచ్చ తో అటు అధికార బీజేపీ ఉక్కిరిబిక్కిరి కావడంతో పాటుగా ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ తన ప్రాధాన్యతను కాపాడుకునే పనిలో పడింది. అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్, బీజేపీ లకు ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాలలోకి కేసీఆర్ అంటే అది సాధ్యమా.?

కాంగ్రెస్, బీజేపీ వంటి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జాతీయ పార్టీలను కాదని భారతీయ రాష్ట్ర సమితిగా ఉన్న ఒక ప్రాంతీయా పార్టీని నమ్మి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో చేతులు కలిపేందుకు, కలిసి నడిసేందుకు ఇతర పార్టీలు ఆసక్తి చూపుతాయా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

YSRCP’s Election Anxiety: Jagan Turns to Allegations

YS Jagan Mohan Reddy seems to have found his biggest election issue even before the…

20 minutes ago

కేటీఆర్‌కు పగటి కలలుకనే హక్కు లేదా?

అవును. బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈ మాట చెప్పారు. నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో మాట్లాడుతూ,…

31 minutes ago