
అయితే, దిల్ రాజు రాబోయే రోజుల్లో ఈ చిత్రం కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ ట్రైలర్ మార్చి 29 న విడుదల కానుంది, తరువాత ఏప్రిల్ 3 న హైదరాబాద్ లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. దీనికి చిరంజీవి, రామ్ చరణ్ లు గూస్ట్లుగా వస్తారని కూడా వార్తలు వస్తున్నాయి.
వకీల్ సాబ్ రీమేక్ చిత్రం కావడంతో కొంత బజ్ తక్కువ ఉంది. కావున మంచి ప్రమోషన్లు అవసరం. ప్రమోషన్లకు దూరంగా ఉండాలనే తన సాధారణ వైఖరికి భిన్నంగా ప్రమోషన్ల కోసం సమయాన్ని కేటాయించాలని దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను కోరినట్లు తెలిసింది. పవన్ సరే అని చెప్పినా ఆయన చేసేవారకు అనుమానమే. సహజంగా పవన్ తన సినిమాలకు బాగా ఎక్కువ అనుకుంటే ఒక ఈవెంట్ కి వస్తారు.
ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక రికార్డెడ్ ఇంటర్వ్యూ ఇస్తారు. దానికంటే భిన్నంగా పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తే మాత్రం విశేషమే. వకీల్ సాబ్ బాలీవుడ్ సూపర్ హిట్.. పింక్ అధికారిక రీమేక్. ఎంసిఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన శృతి హస్సన్ హీరోయిన్ గా కనిపించనుంది.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…