దిల్ రాజు “రివ్యూ” లెక్కలు తప్పాయి!

ఒక సినిమా సక్సెస్ లో వెబ్ రివ్యూల ప్రాధాన్యత ఏ మేరకు ఉందో అందరికీ తెలిసిందే. ఒక క్రేజ్ ఉన్న సినిమా విడుదల అవుతోంది అంటే ముందుగా రివ్యూలపై పడడం సాధారణమైపోయింది. ఇలాంటి తరుణంలో తానూ నిర్మించిన సినిమాకు 3.25 లేదా 3.50 రేటింగ్స్ వస్తాయని నిర్మాత దిల్ రాజు ముందుగానే చెప్పారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత ఒక్క సినీ విమర్శకుడు కూడా దిల్ రాజు ఆశించిన స్థాయిలో రేటింగ్ ఇవ్వకపోవడం విశేషం.

3.50 మాట దేవుడెరుగు కనీసం 3 మార్క్ ను కూడా ఎవరూ టచ్ చేయలేకపోయారు. అంటే దిల్ రాజు తన తాజా చిత్రం విషయంలో వేసిన అంచనాలు బెడిసికొట్టాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అత్యుత్సాహంతో ముందుగానే ప్రకటించి దిల్ రాజు తన స్థాయిని దిగజార్చుకున్నారని, ఎవరి చిత్రాలపై వారికి నమ్మకముండడం సహజమే అయినప్పటికీ, ఈ రేంజ్ లో ప్రకటనలు చేసి ఉండాల్సింది కాదు అన్నది సినీ విశ్లేషకుల భావన.

ADVERTISEMENT

ఇలాంటి పరిణామాలతోనే దిల్ రాజుకు ‘సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్’ అన్న ట్యాగ్ లైన్ దూరమవుతోందని, ఒకప్పుడు ఫెయిల్యూర్ ఎరుగని దిల్ రాజు, ప్రస్తుతం సక్సెస్ కోసం విఫల యత్నాలు చేస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. మరి దిల్ రాజును విజయపు మెట్లు ఎక్కించే హీరో ఎవరు అవుతారో చూడాలి.

Share
Published by

Recent Posts

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

57 seconds ago

Vikram’s Release Turns a Joke: No One Ready to Believe?

Finally, Vikram's long pending project Dhruva Natchathiram, directed by Gautham Vasudev Menon, is all set…

13 minutes ago