Telugu

పవన్ ను భరించడం కష్టమే అని తేల్చాడు!

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా కోసం శరత్ మరార్ ఫోన్ చేసి పవన్ ను కలవమంటే ఆశ్చర్యం వేసిందని, ఆ తర్వాత పవన్ ను కలవడం, సినిమా ఒప్పుకోవడం అంతా ఒక కలలా గడిచిపోయిందని, ఏ విషయంలోనూ రాజీ పడని మనస్తత్వం పవన్ దని, దర్శకత్వం విభాగంలో పవన్ కల్పించుకున్నారన్న వార్తల్లో నిజం లేదని, తనకు పూర్తి స్వేఛ్చ ఇచ్చాడని ‘సర్ధార్’ సంగతులు చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ.

ADVERTISEMENT

అయితే పవన్ ను భరించడం మాత్రం కష్టమేనని, అయితే ఒక్కసారి భరిస్తే వచ్చే కిక్కు వేరని, సాయంత్రం అయిపోయే సమయానికి చిన్న పిల్లాడిలా మారిపోయి చేసే సందడి అంతా ఇంతా కాదని, తానూ చిరంజీవి గారి అభిమాని అని తెలిసి.., బాబీతో ఒక సినిమా చేయి అన్నయ్య, బాగా డైరెక్ట్ చేస్తాడు అని చెప్పిన దాని కంటే గొప్ప విషయం ఏముంటుందని తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు బాబీ.

ఇక, పవన్ సినిమాల నుండి దూరమవుతానంటే, ఆయన ఇంటి ముందు ధర్నా చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని, తదుపరి సినిమాపై ఇంకా దృష్టి పెట్టలేదని, స్వతహాగా మాస్ కమర్షియల్ సినిమాలంటే తనకు ఇష్టమని, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతానని తన అనుభూతులను పంచుకున్నారు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దర్శకుడు

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

11 minutes ago

US Huge Scam: FBI Arrests Most Wanted Indian Kirana Owner

An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…

13 minutes ago