
అయితే ఇదే విషయాన్ని దర్శకుడు హరిని అడిగితే, ‘అవునా… నిజమా… అలా ప్రచారం జరుగుతోందా?’ అంటూ అవాక్కయ్యే విధంగా స్పందించారు. “జూనియర్ ఎన్టీఆర్ తో నాకు ఎప్పటి నుండో పరిచయం ఉందని, ఆయన నటన అంటే తనకు చాలా ఇష్టమని, ఎన్టీఆర్ కు తానూ అభిమానిని, ‘టెంపర్’ సినిమాను రెండు సార్లు చూశానని, అలాంటి ఆయన నాకు తెలియదని ఎలా అంటానని, గతంలో ఓ సినిమా కధ విషయమై చర్చలు జరిపానని, అయితే అది వర్కౌట్ కాలేదని, ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయాలన్నది తన కోరికని” చెప్పుకొచ్చారు హరి.
‘సింగం 3’ తర్వాత ‘సామి 2’ సినిమాను తెరకెక్కించబోతున్నానని చెప్పిన హరి, ప్రస్తుతం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా లేదని స్పష్టం చేసారు. అంతకుముందు జరిగిన ప్రచారంతో కాస్త గుర్రుగా ఉన్న ‘యంగ్ టైగర్’ అభిమానులు, తాజా వ్యాఖ్యలతో శాంతించినట్లుగా కనపడుతోంది. అయితే గతంలో జరిగిన ప్రచారమంతా కేవలం పుకార్లేనంటారా? లేక తెలుగులో ‘సింగం 3’కి దెబ్బ పడుతుందేమోనని భావించిన దర్శకుడు తన వ్యాఖ్యలన్నీ మీడియా సృష్టేనని చెప్పే ప్రయత్నం చేసారా? ఒక్కటైతే నిజం… జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని దక్షిణాది దర్శకుడు ఉండడం.
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…