
ఈ నేపథ్యంలో దర్శకుడు విజయ్ కుమార్ పై అత్త గారు చెప్పులతో దాడి చేసింది. దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ విజయ్ కుమార్, ప్రసూన జంట పోలీసులను ఆశ్రయించారు. మార్చి 1వ తేదీన శ్రీనగర్ కాలనీలోని ఓ దేవాలయంలో విజయ్ కుమార్, ప్రసూనను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న ప్రసూన తల్లిదండ్రులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.
తన కూతురుకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని విజయ్ కుమార్ మాయమాటలు చెప్పాడని, అయితే అతను గతంలోనే వివాహం చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ క్రమంలో ఎస్ఆర్ నగర్ పోలీసులు విజయకుమార్, ప్రసూనను పిలిపించి మాట్లాడారు. తాము ఇద్దరం మేజర్లమని, ఇష్ట ప్రకారమే తాను పెళ్లి చేసుకున్నానని ప్రసూన చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్లిద్దరూ మేజర్లు కనుక కేసు పెట్టడం కుదరదని పోలీసులు చెప్పారు.
దీంతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన విజయకుమార్ పై ప్రసూన తల్లి చెప్పు విసిరేసింది. ఈ సంఘటనతో నిర్ఘాంతపోయిన విజయకుమార్ తనతో వచ్చిన వారితో కలిసి కారులో వెళ్లిపోయారు. అయితే విజయ్ కుమార్ కు గతంలో పెళ్లి అయినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని చూపిస్తామని ప్రసూన తల్లిదండ్రులు అంటున్నారు. తన కూతురిని మోసం చేస్తాడని, అటువంటి సంఘటన జరగకముందే ఆమె తమ వద్దకు వస్తే సరిపోతుందని ప్రసూన తల్లిదండ్రులు అంటున్నారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…