
అయితే ఈ ఆలోచన అలా వచ్చిందో లేదో గానీ, తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సింపుల్ లుక్ లో కనపడుతున్న మహేష్ లుక్ లో పెద్దగా మేకోవర్ లేకపోవడం విశేషం. పెరిగిన గడ్డంతో ఈ సినిమాలో ప్రిన్స్ దర్శనమివ్వబోతున్నారన్న విషయం ఇటీవల హల్చల్ చేసిన నేపధ్యంలో.., ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా సింపుల్ గా కనపడడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసే విషయమే. అయితేనేం… మేకోవర్ లేకపోయినా ప్రిన్స్ ఛార్మింగ్ లుక్ కు ఫిదా కాని ఫ్యాన్ ఎవరున్నారులేండి..? తెల్ల షర్టులో తళతళలాడిపోతున్నాడని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పంచుకుంటున్న అభిప్రాయాలు.
హైదరాబాద్ లో రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ షూటింగ్ లో అనిల్ అరసు నేతృత్వంలో ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు పుట్టినరోజు వేడుకలను మహేష్ – మురుగదాస్ సమక్షంలో చిత్ర యూనిట్ జరిపింది. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరగనుండగా, సెప్టెంబర్ లో 15 రోజుల పాటు అవుట్ డోర్ షూటింగ్ కు చిత్ర యూనిట్ పయనమవనుంది. అయితే మరో రెండు రోజుల్లో ప్రిన్స్ పుట్టినరోజు ఉండడంతో, తాజా సినిమాకు సంబంధించిన ఒక అధికారిక పోస్టర్ విడుదల అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…