
కరీంనగర్ లోని కొండాపూర్ గ్రామస్తులు పూరీ జగన్నాధ్ పై ఉన్న అభిమానంతో ఓ విగ్రహాన్ని తయారు చేయించారు. పూరీ తనయుడు ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిపారు. తన తండ్రి విగ్రహంతో సెల్ఫీలు తీసుకుంటూ ఆకాష్ చేసిన సందడి ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. పూరీ విగ్రహంతో టాలీవుడ్ లో ఈ ‘ట్రెండ్’ కొనసాగుతుందేమో చూడాలి.
సహజంగా తెలుగు ప్రేక్షకులు హీరోలపై ఎక్కువ అభిమానం చూపిస్తుంటారు. తమ అభిమాన హీరో ఏది చెప్తే అది గుడ్డిగా చేసే అభిమానుల సంఖ్యకు కొదవలేదు. అలాంటి హీరోలు డామినేట్ చేస్తున్న సినీ ప్రపంచంలో… పూరీ జగన్నాధ్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉండడం, వాళ్ళు విగ్రహం పెట్టే స్థాయిలో ఉండడం… పూరీ రేంజ్ ఏంటో ఈ అభిమానులు పరోక్షంగా చాటిచెప్తున్నారా?
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…