
దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం అంటూ తెలిపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి సమస్యతో ఉన్న కుర్రాడిగా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ..నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించారు. ఇలాంటి పాత్రలతో తమలో ఉన్న నటన ను మరింతగా బయిటపెట్టడానికి వీలుంటుందని ఎన్టీఆర్ చేసిన ఆ సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అదే సాహసం చెయ్యబోతున్నాడు. గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ తరువాత కూడా విజయ్ కేరీర్ సెట్ కాలేదు.
యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం, డిఫరెంట్ సినిమాలు చెయ్యడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పరాజయాలు ఎక్కువ అయ్యాయి. గీత గోవిందం తరువాత మూడు సినిమాలు విడుదలైనా టాక్సీవాలా ఒక్కటే ఒక మాదిరిగా ఆడింది. మిగతా రెండు సినిమాలు… నోటా, డియర్ కామ్రేడ్ ఘోరంగా విఫలమయ్యాయి. విజయ్ కేరీర్ లో పని చేసిన మొట్టమొదటి స్టార్ డైరెక్టర్ పూరినే.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…