
ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తాము తారక్ పుట్టినరోజుకు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా వీడియో ప్రోమోను విడుదల చేయడం లేదని ప్రకటించింది. ఏదో హడావుడిగా వీడియో ప్రోమోను విడుదల చేయాలనుకోవడం లేదని, తామెంతోగానో ప్రయత్నించామని, అయితే లాక్ డౌన్ కారణంగా తాము తారక్ వీడియో విడుదల చేయలేకపోతున్నామని యూనిట్ తెలియజేసింది.
అయితే ఎప్పుడు తారక్ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అందరికీ పెద్ద పండుగే అవుతుందని కూడా ఆర్ఆర్ఆర్ యూనిట్ తెలియజేసింది. దీనితో రాజమౌళి పై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. వారి కోపం కూడా ఒక రకంగా న్యాయమైనదే. లాక్ డౌన్ కారణంగా టీజర్ విడుదల కావడం లేదు సరే… రెండు సంవత్సరాలు షూటింగ్ చేసి కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లేకపోవడమేంటి?
టీజర్ కు అయితే షూటింగ్ చెయ్యాలి అన్నారు…. పోస్టరు కు ఆ అవసరం లేదు. రెండేళ్ల నుండి వెయిట్ చేయించి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కూడా నిరాశ పర్చడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఆర్ఆర్ఆర్ విడుదలకు ఏడాది పైగానే సమయం ఉంది.
Following the failure of the recently released Kara, Dhanush is currently acting as the lead…
For decades, Aamir Khan built his reputation by going against mainstream Bollywood formulas. At a…