
ఆయా సినిమాలోని నటులతోనే ఈ ప్రకటన చేయించడం విశేషం. దివంగత సుశాంత్ సింగ్ రాజపుట్ చివరి సినిమా దిల్ బేచారా, అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబు, అజయ్ దేవగన్ భుజ్, అభిషేక్ బచ్చన్ బిగ్ బుల్, అలియా భట్ సడక్ 2, కునాల్ కెమ్ము లూట్ కేస్, విద్యుత్ జంవాల్ ఖుదా హఫీస్… డైరెక్టుగా హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న ఏడు బాలీవుడ్ హిట్ సినిమాలు.
ఈ ఏడు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఈ సినిమాలన్నీ జులై నుండి అక్టోబర్ మధ్యలో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటాయని సమాచారం. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ భారీ ప్రకటనతో టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఆన్ లైన్ రిలీజ్ కు వెళ్లకుండా ఆగిన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
హాట్ స్టార్ దూకుడుతో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ కూడా అంతే అగ్రసివ్ గా స్పందించే అవకాశం ఉంది. దీనితో నిర్మాతలకు ఇచ్చే ధరలు కూడా పెంచవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే ఆస్కారం కనిపించకపోవడంతో ముందు ముందు ఓటీటీల హవానే నడిచేలా ఉంది.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…