
తాజాగా జరిగిన దుబాయ్ షెడ్యూల్ పూర్తయ్యిందని చిత్ర యూనిట్ ఓ ఫోటోను విడుదల చేసారు. అబుదాబిలో జరిగిన ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లపై పాటలు మరియు చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. అంతకుముందు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపిన షెడ్యూల్ కూడా ప్లానింగ్ ప్రకారం ముగియడంతో అనుకున్న సమయానికి సినిమా ధియేటర్లలో ల్యాండ్ కావడం తధ్యంగా చెప్పుకోవచ్చు.
అయితే ఏప్రిల్ నెలాఖరులో ‘బాహుబలి 2’ విడుదలకు ముహూర్తం కుదరగా, జూన్ నెలాఖరులో మహేష్ – మురుగదాస్ ల సినిమా ఉంది. బహుశా ఈ రెండింటి మధ్యలో ‘దువ్వాడ జగన్నాధమ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల నుండి మంచి స్పందన రావడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయి.
Allari Naresh is officially back in top form with Ramba Oorvasi Menaka, reminding everyone of…
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…