
మరోవైపు 1989 తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించిన అన్నాడీఎంకే అధినేత్రి ‘అమ్మ’ జయలలిత విజయం వెనుక ఉన్న సీక్రెట్ బయటపడింది. ‘6’ సంఖ్య అంటే జయలలితకు బాగా సెంటిమెంట్ అని, అందుకే పార్టీ మేనిఫెస్టోను 6వ తేదీన ప్రకటించారని, ఎన్నికల నిమిత్తం ప్రజలకిచ్చిన ప్రధాన హామీల సంఖ్య కూడా ఆరేనని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. కేరళలోని ఒక జ్యోతిష్కుడిని తరచుగా సంప్రదిస్తుంటారని, ఇప్పటివరకు ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జయలలిత, తాజా ఫలితాలతో ఆరో సారి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం వెనుక ఉన్నది కూడా “6” అని పొలిటికల్ వర్గాల టాక్.
ఇదిలా ఉంటే, విజయాన్ని సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తున్న జయలలితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, అన్నాడీఎంకే నేతలు ఆప్యాయంగా ‘విప్లవనాయకి’గా పిలుచుకునే జయలలితకు ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ రోశయ్య నుంచి మంత్రుల వరకూ శుభాభినందనలు తెలుపుతున్నారు. జయలలిత మీడియా సమావేశాన్ని ముగించిన తరువాత, ఎంతో మంది నేతలు పుష్పగుచ్ఛాలిచ్చి పాదాభివందనాలు చేయగా, మరికొందరు మాత్రం ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేశారు. అభినందనలను చిరునవ్వుతో స్వీకరించిన జయలలిత ఎంతో సంతోషంగా కనిపించారు.
Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…
Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…