
ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. గత ప్రభుత్వానికి విధేయంగా పనిచేసిన నేరానికి ఏవో కుంటిసాకులతో ప్రభుత్వం రెండేళ్ళు సస్పెండ్ చేసింది. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రెండేళ్లకు పైగా పోరాడి పదవి దక్కించుకొన్నారు. కానీ కొన్ని రోజులకే ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఆయన పేరు ఏబీ వేంకటేశ్వర రావు.
అతనో సీనియర్ వైద్యుడు… కరోనా సమయంలో రోగులకు ఎంతో సేవ చేశాడు. కానీ ప్రభుత్వం తమకి మాస్కులు, గ్లౌజులు వగైరా కూడా ఇవ్వడం లేదని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఆ తర్వాత ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు. నడిరోడ్డులో బట్టలు ఊడదీసి చేతులు విరిచికట్టి మీడియా ముందు నిలబెట్టి అవమానించారు. ప్రభుత్వం ఆయనని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది. ఈ మనోవేదన భరించలేక చివరికి ఆయన చనిపోయారు. ఆయన పేరు డాక్టర్ సుధాకర్. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పనిచేసేవారు.
అతనొక సాధారణ పోలీస్ కానిస్టేబుల్. ప్రభుత్వం పోలీసులకు సెలవుల బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్లకార్డు పట్టుకొని ధర్నా చేశాడు. తర్వాత సస్పెండ్ అయ్యాడు. అక్రమ సంబంధాలు, చీటింగ్ కేసుల క్రింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతని పేరు ప్రకాష్. అనంతపురం జిల్లాలోని పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు. అప్పటి నుంచి సస్పెన్షన్లోనే ఉన్నాడు.
ఆయన ఒక ఆర్టీసీ డిపో మేనేజర్. ఆర్టీసీకి చెందిన స్థలంలో వైసీపీ కార్యాలయానికి కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. అదీ… మంత్రులు శంకుస్థాపన చేస్తునప్పుడే ఇది సరికాదని వారికే చెప్పారు. రెవెన్యూ అధికారులు ఆయనపై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆయనని కేంద్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆయన స్థానంలో వేరే వ్యక్తిని డిపో మేనేజర్గా నియమించారు. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో చీరాల డిపో మేనేజర్ ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. కనుక శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగంలో నుంచి సస్పెండ్ అయినట్లే భావించవచ్చు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…