
ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో భారత్ కు చెందిన వ్యాపారులు అతుల్ చోర్దియా, సాగర్ చోర్దియా, కాల్పేశ్ మెహతాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత ఆర్థిక వ్యవస్థ, మోదీ తీసుకుంటున్న చర్యలపైనే మాట్లాడుకున్నామని సాగర్ చోర్దియా మీడియాకు తెలిపారు. ఈ భేటీలో డొనాల్డ్ ట్రంప్ వారసులు ఇవాంకా, ఎరిక్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా పాల్గొన్నారని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌కు భారత్‌లోనూ వ్యాపారాలు ఉన్నాయని, ఇండియాలో ఉన్న ఐదు లగ్జరీ ప్రాజెక్టుల్లో ‘ట్రంప్ టవర్’ కూడా ఒకటి.
దీనిని పుణెలో పంచశిల రియాలిటీ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. అంతేగాక, ఆయన సంస్థ ఆధ్వర్యంలో ముంబయిలో మరో 300 అపార్టుమెంటులు నిర్మిస్తున్నారు. ఈ సమావేశం సందర్భంగా ట్రంప్ వారసులు భారత్ లో తమ ప్రాజెక్టులను విస్తరించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అధికారికంగా సదరు సమాచారం వెల్లడి కానప్పటికీ, మీడియా వర్గాలలో మాత్రం ప్రధానంగా వినపడుతోంది.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…