
ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్ యుద్ధ పరిణామాలు, హెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై కొత్త ఆంక్షలు.. వీటన్నింటి ప్రభావం అమెరికాతో సహా యావత్ ప్రపంచ దేశాలపై పడుతూనే ఉంది.
భారత్లో ఎలాగూ ఐటీ సంబందిత రంగాల్లో వేలాది ఉద్యోగాలు పోతున్నాయి. ట్రంప్ నిర్ణయాల కారణంగా ఇప్పుడు అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తున్న భారతీయులు కూడా తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతోంది.
హెచ్1బీ వీసాలు విషయంలో మైక్రోసాఫ్ట్ వంటి అతిపెద్ద సంస్థలు కూడా ట్రంప్ ఒత్తిడికిలోనవుతుండటం ఇంకా ఆందోళన కలిగించే విషయమే.
అటువంటి అతిపెద్ద సంస్థలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశవిదేశాల నుంచి సేవలందిస్తున్న కంపెనీలపై కూడా అ ప్రభావం పడితే ఉద్యోగాల కోతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే ఏఐ వినియోగం పెరగడంతో పలు రంగాల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఏఐ సృష్టిస్తున్న కొత్త అవకాశాల కంటే దాంతో పోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది.
ఏఐతో ఉద్యోగాల స్వభావం కూడా సమూలంగా మారిపోతోంది. ఈ కారణంగా కొత్త నియామకాలు ఆశించిన స్థాయిలో లేకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుండటంతో భారత్లో నిరుద్యోగ సమస్య శరవేగంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొనడంతో ఉద్యోగాలు కోల్పోయిన కొందరు టెక్కీలు తమ సహచరులను అప్రమత్తం చేస్తున్నారు.
హటాత్తుగా ఉద్యోగం పోయి ఆదాయం లేకపోయినా తట్టుకునేలా ముందుగానే ప్లాన్ చేసుకోమంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
లక్షల మంది భారతీయులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న గల్ఫ్ దేశాల్లోనూ యుద్ధాల కారణంగా ఉద్యోగావకాశాలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.
ఒకవేళ అటు అమెరికా, యూరప్ దేశాల నుంచి, ఇటు గల్ఫ్ దేశాల నుంచి అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ ఉద్యోగులు స్వదేశానికి తిరిగివస్తే అప్పుడు భారత్ పరిస్థితి ఏమిటి? అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో లేదో తెలీదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న రాజకీయ పార్టీలు, వాటి నాయకులు నిరంతరం తమ ప్రత్యర్ధులతో రాజకీయ ఆధిపత్యపోరులో మునిగి తేలుతున్నారు తప్ప ముంచుకొస్తున్న ఈ పెను ఉపద్రవాన్ని గుర్తించినట్లు కనబడదు.
ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు ముందే నుంచే హెచ్చరిస్తున్న మేల్కొని ముందస్తు జాగ్రతలు తీసుకోని పాలకులు, ముంచుకొస్తున్న ఈ నిరుద్యోగ ఉపద్రవం గురించి ఆలోచించగలరా? ఆలోచించినా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడతారా?
Payal Radhakrishna makes a black dress feel anything but predictable in this striking fashion shoot.…
Drishyam 3 actress Shriya Saran has opened up about being a victim of AI-morphed photos.…