Telugu

అమెరికా అధ్యక్షుడు ‘ఖైదీ నంబర్ 150’ చూసారంట!

సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో పోటీపడి మరీ రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” ఏకంగా 2 మిలియన్ క్లబ్ లో చేరి రికార్డు సొంతంగా చేసుకోగా, బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” 1 మిలియన్ క్లబ్ లో చేరి తన హావా కొనసాగిస్తోంది. ఇప్పటికే 2 మిలియన్ సంఖ్యను దాటిన బాహుబలి, శ్రీమంతుడు, అ…ఆ…, నాన్నకు ప్రేమతో చిత్రాల సరసన మెగా మూవీ ‘ఖైదీ’ కూడా నిలిచింది.

ఇంతలా వసూళ్లు రాబడుతోన్న మెగాస్టార్ సినిమాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా వీక్షించారట. అంతేకాదు, చూసిన తర్వాత చిరంజీవికి వెంటనే ఫోన్ చేసి అభినందనలు తెలిపారట. గ్రేట్ పర్సన్, గ్రేట్ మూవీ, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ట్విట్టర్ వేదికగా తన అనుభూతులు కూడా ట్రంప్ వ్యక్తపరిచినట్లుగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. తెలుగు భాష రానటువంటి ట్రంప్ కు ‘ఖైదీ నంబర్ 150’ ఎలా అర్ధమై ఉంటుందని అనుకుంటున్నారా? అక్కడే పప్పులో కాలేసారు.

ADVERTISEMENT

మెగా అభిమానుల ఉత్సాహానికి నిదర్శనంగా ఈ ట్వీట్ ను చెప్పుకోవచ్చు. సంక్రాంతి సెలవుల కారణంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ ఆనందంలో ఈ ట్వీట్ ను తయారుచేసి సోషల్ మీడియాలోకి వదిలారు. అంతా బాగానే మేనేజ్ చేసారు గానీ, ఒక్క డేట్ విషయంలో మాత్రం సదరు అభిమాని కూడా పప్పులో కాలేసినట్లుగా అర్ధమవుతోంది. ఎప్పుడో వారం రోజుల క్రితం డేట్ తో సృష్టించి, ఇప్పుడు సర్క్యూలేట్ ఎలా చేస్తారు? అయితే అది కూడా చూడని కొందరు అభిమానులు మాత్రం ఇది నిజమేమో అన్న భావనలో ఈ ట్వీట్ ను షేర్ చేయడం విశేషం.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

First Big Blunder By Vijay As CM Already?

The people of Tamil Nadu have delivered a strong mandate against the existing DMK and…

20 minutes ago

Years of SVP: The ‘Hit’ That Every Mahesh Fan Wants to Forget

Today marks exactly four years since the release of Sarkaru Vaari Paata, but for the…

40 minutes ago