
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఆత్మీయుల మధ్య పుట్టి పెరిగిన అమ్మాయి, పెళ్లయిన తర్వాత ఒక్కసారిగా వారందరినీ వదిలేసుకుని కనీసం ముఖ పరిచయం కూడా లేని భర్త, అత్తవారింట్లో మిగిలిన జీవితం గడిపేందుకు సిద్ధమవుతుంది.
అలాంటప్పుడు భర్త, అత్తవారింట్లోని వారు ఆమె తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను మరిపించాలి. హనుమకొండ జిల్లా గుండేడు గ్రామానికి చెందిన శ్రీజ కూడా అలాగే అత్తవారింట్లో అడుగుపెట్టింది.
కానీ చాలా మంది అమ్మాయిలకు అత్తవారింట్లో ఎదురయ్యే చేదు అనుభవాలు ఆమెకు పెళ్లైన మూడు నెలలకే మొదలయ్యాయి. ఆమె భర్త రాజు, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు.
అలా నాలుగేళ్లు నరకం అనుభవించిన శ్రీజను ఆమె భర్త ఇంట్లో నుంచి తరిమేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు మారలేదు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.
ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వేలాది మంది మహిళల జీవితాలు తలక్రిందులు అవుతూనే ఉన్నాయి. కనుక ఇలాంటి ఘటనలను కూడా చాలా మందికి ఓ కాలక్షేప వార్తగానే కనిపించవచ్చు. కానీ అది ఆమె జీవితానికి సంబంధించిన తీవ్రమైన సమస్య.
కనుక పోరాడక తప్పదు. అయితే ఈ విధంగా వేధింపులు, తిరస్కరణకు గురైన మహిళలు, వారి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
భార్యను, కుటుంబ బంధాలను గౌరవించని వ్యక్తితో కాపురం చేయాలనుకోవడం సరైన ప్రయత్నమేనా? ఒకవేళ ఈ పోరాటం ఫలించి భర్తను దక్కించుకున్నా అతని ఆలోచనా ధోరణి, మనస్తత్వం, దురాశ, దుర్బుద్ధి మారుతాయా?
భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి బుద్ధి నిలకడగా ఉంటుందా? అలాంటి భర్తను దక్కించుకోవడం కోసం పోరాటం అవసరమా? అని ఆలోచిస్తే పోరాటం వేరేలా మారుతుంది.
ఆమెను వేధించిన భర్తకు, అత్తమామలకు చట్టప్రకారం శిక్ష పడేలా చేసి, వారి వల్ల ఆమెకు కలిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలం దక్కేందుకు న్యాయస్థానాలు కూడా సాయపడతాయి కదా?
చెడిపోయిన శరీర అవయవాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించుకుని మిగిలిన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటామో, అదే విధంగా ఇటువంటి బంధాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా వదులుకున్నప్పుడే మళ్లీ మనశ్శాంతి, కొత్త జీవితం లభిస్తుంది.
ఈ వాస్తవాన్ని అంగీకరించడం, కొత్త దారి ఎంచుకోవడం రెండూ కష్టమే. కానీ అదే మంచిది. మన మనశ్శాంతి, మన ఆత్మగౌరవం, మన జీవితం కంటే ఇలాంటి బంధం గొప్పది కానే కాదు.
The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…
Ajay Devgn’s Drishyam: The Conclusion is doing wonders at the box office. The movie has…