Telugu

కష్టకాలంలో టీడీపీ సీనియర్లకు గ్రహణం?

ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కోడెల శివప్రసాదరావు కాసేపటి క్రితం మృతి చెందారు. గుండె పోటు కారణమని కొందరు అంటుండగా, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటున్నారు. ఎలాగైతేనేం తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నేతను కోల్పోయింది. అయితే తెలుగుదేశం పార్టీ గురించి బాగా తెలిసిన వారికి ఒక విషయం అనిపించకమానదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండి బాగా ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించినప్పుడల్లా తన సీనియర్ నేతలను కోల్పోతుంది.

2004-14 మధ్య తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డుకాలం అని అంతా అంటారు. ఆ సమయంలో పార్టీ పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, వంటి సీనియర్ నాయకులను కోల్పోయింది. 2019 ఎన్నికల ఓటమి తరువాత టీడీపీ మరోసారి గడ్డు కాలం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలలో ఘోరపరాజయం, భవిష్యత్తు నాయకత్వం గురించి అనుమానాల నేపథ్యంలో, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉండడం వల్ల టీడీపీకి వచ్చే ఐదేళ్ళు గడ్డు కాలం అంటున్నారు.

ADVERTISEMENT

ఇప్పుడు అటువంటి సమయంలోనే మరో సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. కోడెల పార్టీకి పల్నాడు ఏరియాలో కీలకమైన నేత. ఆయనను ఇటువంటి కీలకమైన తరుణంలో కోల్పోవడం టీడీపీకి భారీ నష్టం అనే చెప్పుకోవాలి. ఈ వార్తతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, అభిమానులు తీవ్రంగా కలతచెందారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోడెల మృతికి సంతాపం తెలియజేశారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Prabhas Takes a Dig at Neel, Gets Salaar 2 Update

Prabhas turned a casual conversation with Prashanth Neel into a fun moment, and fans got…

7 hours ago

Udta Teer Public Talk: Mockery of Dhurandhar Working?

Ayushmann Khurrana and Sara Ali Khan’s Udta Teer has arrived in theatres on October 23,…

7 hours ago