
కరోనా మొదలైన నుండి ఇప్పటివరకు, దుల్కర్ సల్మాన్ సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అందులోనూ చేసిన ప్రతి సినిమా హిట్టే. కురుప్, కనులుకనులను దోచాయంటే, సీత రామం, చుప్ అన్నీ హిట్ సినిమాలే. సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయలేని హీరోలున్న ఈ రోజుల్లో, ఏడాదికి రెండు సినిమాలు చేసి హిట్లు కొట్టి నవతరం హీరోల్లో అందరికంటే ముందున్నాడు దుల్కర్.
చుప్ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే ఒక పాన్ ఇండియా సినిమా రెడీ చేస్తున్నాడు దుల్కర్. ‘కింగ్ ఆఫ్ కోత’ అనే సినిమా స్టార్ట్ చేసాడు దుల్కర్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తానే నిర్మాతగా, భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు. ఈ సినిమా కి మలయాళం లో సుప్రసిద్ధ దర్శకుడు జోషి తనయుడు అభిలాష్ జోషి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు.
దుల్కర్ నిర్మాతల హీరో అనిపించుకుంటున్నాడు. తెలుగులో అశ్వినిదత్ లాంటి పెద్ద నిర్మాత, దుల్కర్ తో ప్రతి సంవత్సరానికి ఒక సినిమా చేస్తాననడం అందుకు నిదర్శనం. దుల్కర్ తన అభిమానులను అలరించడానికి మంచి వెరైటీ కథలను ఎంపిక చేసుకుని, సినిమా సినిమా కి పరిణితి చెందిన నటనని ప్రదర్శిస్తున్నాడు. ఇదే స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ పోతే అభిమానులకు పండగే! పరిశ్రమకూ మంచిదే!
Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…
In the Bigg Boss TV reality show, every season, someone gets a lot of push.…