
ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో… తన కొత్త చిత్రం “రాజా ది గ్రేట్” సినిమాను వెరైటీగా పబ్లిసిటీ చేయడానికి, ఆ చిత్రంలో నటించిన హీరో రవితేజ, హీరోయిన్ మేహ్రీన్, మరియు నటకిరీటి రాజేంద్రప్రసాద్, కమెడియన్ శ్రీనివాస్ లు కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ… ఓ వీడియోను రూపొందించి, విడుదల చేసింది. ఈ వీడియోలోనే రవితేజ ఇలా వినూత్నంగా ట్రై చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
‘పటాస్, సుప్రీమ్’ వంటి రెండు కమర్షియల్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్’ సినిమాగా “రాజా ది గ్రేట్”ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను అలరించడంలో విజయవంతం కావడంతో, అనిల్ కు ‘హ్యాట్రిక్’తో పాటు, రవితేజకు కూడా ‘బౌన్స్ బ్యాక్’ హిట్ అవుతుందని చిత్ర వర్గాలు అంచనాలతో ఉన్నాయి.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…