Telugu

ఇంత మాట్లాడినా… ఏం కాంట్రవర్సీ లేదండోయ్..!

ఒకప్పుడు సినీ హీరోలు మైక్ పట్టుకుని గంటలు గంటలు మాట్లాడితే అభిమానులు వింటా ఉండేవారు తప్ప, మరో ఆలోచన చేసే వారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా కాదు. ఓ రెండు ముక్కలు మాట్లాడితే… అందులో ఎన్ని వివాదాలు ఉన్నాయో వెతికే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో… సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడుతున్నారు అనేది అత్యంత కీలకంగా మారింది, అందుకు తగ్గట్లుగానే వారు కూడా ఆచితూచి మాట్లాడుతుండడం గమనించదగ్గ విషయం. ‘చెప్పను బ్రదర్’ ఉదంతం తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది.

‘దువ్వాడ జగన్నాధమ్’ ప్రమోషన్స్ లో ఉన్న అల్లు అర్జున్ తాజా ఇంటర్వ్యూలో యాంకర్ ఓ కీలక ప్రశ్న అడుగుతూ బన్నీని చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేయగా, బన్నీ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, చాలా ఓపెన్ గా, బోల్డ్ గా జవాబులు చెప్తూ విజయవంతంగా బయటపడ్డాడు. మన అగ్ర హీరోలు హీరోయిన్లపై ఓపెన్ గా మాట్లాడరు గనుక, ‘తనతో నటించిన హీరోయిన్లు ఏ ఏ కాస్ట్యూమ్స్ లో ఎవరెవరూ అందంగా ఉంటారు?’ అంటూ యాంకర్ వరుసగా టాప్ హీరోయిన్ల పేర్లు చదవగా, బన్నీ వాటికి “సరైనోడు” రీతిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

కాజల్ : వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లో చాలా బాగుంటుంది.

తమన్నా : చీరకట్టులో తమన్నా బాగుంటుంది. తమన్నా నడుము చాలా బాగుంటుంది, శారీలో నడుము హైలైట్ అవుతుంది, కనుక తమన్నాకు చీరకట్టు అయితే సూట్ అవుతుందని అనుకుంటున్నాను. ‘రచ్చ’లో సాంగ్ చూసినపుడు నాకు అదే అనిపించిందని ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గా చెప్పాడు బన్నీ.

సమంత : వెస్ట్రన్ అయినా, సంప్రదాయ దుస్తులైనా బాగుంటాయి.

ఇలియానా : వెస్ట్రన్ లో బాగుంటుంది. నో డౌట్… ముఖ్యంగా ఇలియానా నడుము బాగుంటుంది కాబట్టి, అది కనపడే విధంగా డ్రెస్ లు వేస్తే లుక్ వస్తుంది. ‘జులాయి’ సినిమా కోసం దుబాయ్ షూటింగ్ చేసినపుడు, పేకప్ అయిపోయిన తర్వాత తన రెగ్యులర్ అవుట్ ఫిట్ వేసుకుని వచ్చింది, సినిమాలో కంటే బయట చాలా బాగుంది.

శృతిహాసన్ : మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి, రాక్ లుక్ లో ఉండే బట్టలు బాగా సూట్ అవుతాయి, శృతిహాసన్ కు సూట్ అయినట్లుగా రాక్ లుక్ కాస్ట్యూమ్స్ మరో హీరోయిన్ కు సూట్ కావని స్పష్టంగా చెప్పాడు.

పూజా హెగ్డే : పూజా ఉన్న హైట్ కు షార్ట్ బట్టలు వేసుకుంటే బాగుంటుందని బన్నీ చెప్పిన జవాబులకు యాంకర్ ఫిదా అయ్యింది.

సూపర్… చాలా జెన్యూన్ గా చెప్పారు అంటూ యాంకర్ పొగడగానే… ఒక్కొక్కళ్ళకు ఒక్కో యూనిక్ నెస్ ఉంటుంది, అదే నేను చెప్పాను… అంటూ బన్నీ సింపుల్ గా అన్నాడు గానీ, హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడేటపుడు వల్గారిటీకి తావు లేకుండా మాట్లాడడం చాలా అరుదు. కానీ బన్నీ ఆ విషయంలో నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుని, అసభ్యతకు గానీ, వివాదానికి గానీ తావు లేకుండా… నిజంగా ఆయా హీరోయిన్లకు సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ ను కరెక్ట్ గా చెప్పాడు. దీన్ని బట్టి బన్నీకి మాంచి టేస్ట్ ఉందోయ్ అని చెప్పడంలో తప్పు ఏమైనా ఉందా..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Karthi’s Desperate Attempt to Turn Mass: Wrong Choice?

Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…

30 minutes ago

What A Video: CBN Bows To Godavari @ Polavaram!

Andhra Pradesh chief minister, Chandrababu Naidu has been fully committed and dedicated towards the completion…

60 minutes ago