
ఈ ఒరవడికి ఎక్కడ బ్రేక్ పడుతుందో గానీ, పవన్ అభిమానులకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నాడు బన్నీ. “దువ్వాడ జగన్నాధమ్” సినిమా ప్రమోషన్ లో భాగంగా మరో లిరికల్ సాంగ్ ను సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. “గుడిలో… బడిలో… మడిలో…” అంటూ దేవిశ్రీ స్వరపరిచిన పాట ఆరు గంటల నుండి యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కానుంది. దీంతో ఈ పాట కూడా ‘శరణం భజే’ మాదిరి ‘డిస్ లైక్స్’కు బలవుతుందో లేక మినహాయింపు పొందుతుందో చూడాలి.
ఇటీవల విడుదలైన మొదటి పాట ‘శరణం భజే’ ఆడియో పరంగా సంతృప్తి పొందేలా ఉండడంతో, 2.30 మిలియన్ క్లిక్స్ రాగ, పవన్ ఫ్యాన్స్ సత్తాతో దాదాపుగా 19 వేల డిస్ లైక్స్ మార్క్ ను కూడా అందుకున్నాయి. దీంతో పవన్ అభిమానులు మరోసారి హైలైట్ అయ్యారు. అందులోనూ పాట విడుదలైన కొద్ది నిముషాలకే వేలల్లో డిస్ లైక్స్ వెల్లువ ప్రారంభం కావడంతో, ఈ సారి ఏ రేంజ్ లో ‘డిస్ లైక్స్’ వస్తాయో అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే పవన్ నటించిన ‘కాటమరాయుడు’ ట్రైలర్ విషయంలో కూడా ఇదే రకమైన డిస్ లైక్స్ వచ్చిన విషయం తెలిసిందే.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…