
హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ షో యుఎస్ లో పడనుంది. అయితే ఈ ప్రీమియర్ షోలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎప్పుడూ రొటీన్ గా వేసే ప్రీమియర్ షోల కంటే ముందుగా యుఎస్ లో షోలను ప్రదర్శించడం విశేషం. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన “బాహుబలి 2”కు కూడా ఇంత ఎర్లీగా షోలను వేయకపోవడం గమనించదగ్గ అంశం. సహజంగా యుఎస్ ప్రీమియర్స్ అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉంటాయి. ఎప్పుడూ తెలుగు సినిమాలు ఇదే సమయానికి ఓ గంట కాస్త అటు ఇటుగా ఉంటాయి.
కానీ “దువ్వాడ జగన్నాధమ్” షో మాత్రం మధ్యాహ్నం 2.30 నిముషాల నుండే మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అంటే ఇండియన్ సమయం ప్రకారం షుమారుగా అర్ధరాత్రి 12 గంటలకు యుఎస్ లో షో ఫస్ట్ షో పడనుంది. దీంతో “డీజే” టాక్ అనుకున్న సమయాని కంటే ముందుగానే ప్రేక్షకులను పలకరించనుంది. ఇంతకుముందు ఒక్క రజనీకాంత్ “కబాలి” సినిమాకు మాత్రమే ఇలా 2.30 నిముషాలకు ప్రీమియర్స్ ను ప్రదర్శించారు.
అయితే ఈ టైం యుఎస్ ప్రేక్షకులకు అస్సలు అనుకూలం కాదని, “దువ్వాడ” ప్రీమియర్స్ కు వస్తున్న స్పందన చెప్పకనే చెప్తున్నాయి. యుఎస్ వర్కింగ్ అవర్స్ టైమింగ్స్ కావడంతో… ఈ షోలకు ప్రేక్షకుల స్పందన అంతంత మాత్రంగానే ఉందనేది ప్రాధమికంగా లభిస్తున్న సమాచారం. ఏపీ, తెలంగాణాలలో మాదిరి యుఎస్ లో అల్లు అర్జున్ పెద్ద క్రేజ్ ఉన్న హీరో కూడా కాదు. మరి ‘డీజే’ యూనిట్ ఎందుకు ప్రయోగం చేసిందో మరికొద్ది గంటలు గడిస్తే… తెలిసిపోతుంది. అంటే భారతీయ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రే “డీజే” టాక్ తెలిసిపోనుంది.
Mahi Gaur brings an intoxicating wave of monsoon magic to the fashion spotlight with an…
418, the Telugu horror-thriller presented by Prashanth Neel, was supposed to release on July 31,…