
తాజాగా డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ కూడా హీరోగా తెలుగు తెరకు పరిచయం కావడానికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ను పరిచయం చేసిన టాప్ డైరెక్టర్ వివి వినాయక్ చేతికే దానయ్య కుమారుడు ప్రాజెక్ట్ కూడా వెళ్ళబోతోందని టాక్. ఇందు నిమిత్తం ఇప్పటికే ఓ దఫా వినాయక్ తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు కళ్యాణ్ కూడా నటన, పాటలు, ఫైట్లల్లో శిక్షణ తీసుకుంటున్నాడట. ప్రొడ్యూసర్ తనయుడిగా విక్టరీ వెంకటేష్ ఒక్కడే టాప్ స్థాయికి చేరుకోగా, ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన వారిలో హీరో నితిన్ ఒక్కడే కొంత స్థాయి వరకు చేరుకున్నాడు. అల్లు అర్జున్, రానా వంటి స్టార్ హీరోలు కూడా ప్రొడ్యూసర్ తనయులే అయినా, వారి బేస్ మెంట్ వేరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…