
వైసీపీ మాటలకు అర్దాలు వేరులే అన్నట్లుగా… కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అంటూ ఇప్పటి వరకు మీడియాల ముందు ఉదరగొట్టే వైసీపీ నాయకుల అసలు ఉద్దేశాలు ఎన్నికలకు మూడు నెలల ముందే భయపడుతున్నాయి. తాజాగా వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి క్రిస్మస్ వేడుకలకు ముందు జరిగిన సువార్త సభల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రైస్తవుడు ముఖ్యమంత్రి కావాలని అది మన జగనే అవ్వాలని నేను ఆశపడుతున్నా అంటూ రాష్ట్రంలో ‘మత రాజకీయాలకు’ ద్వారం తెరిచారు ద్వారంపూడి.
నేను ఎమ్మెల్యేగా, కన్నబాబు మంత్రిగా, అక్కడ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అందరం ఉన్నామంటే మీ ఆశీర్వాదాలు, మీ ప్రార్థనలు, దేవుడి యొక్క బలమే అని కచ్చితంగా చెపుతాను. ఎన్నికలకు ఇంకా 140 రోజులు సమయం ఉంది. ఆ 140 రోజుల తరువాత ఏపీ కి ముఖ్యంమత్రి ఎవరో తేలిపోతుంది. ఆ ముఖ్యమంత్రి కచ్చితంగా క్రైస్తవుడే అయినా జగనే ఉండాలని నా కోరిక. అప్పుడే మన పాస్టర్లు, క్రైస్తవ సమాజం అభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతుంది అంటూ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ఒక మతాన్ని ఉద్దేశించి ప్రసంగించడం చూస్తుంటే వైసీపీ పార్టీ మతాల ప్రాతిపదికగా ఓట్ల రాజకీయాలకు తేర లేపిందని స్పష్టంగా తెలుస్తుంది.
జగన్ ముఖ్యంత్రి అయిన నాటి నుండి హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగిపోవుతున్నాయని, హిందువులకు అత్యంత పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుపతి కొండ పైన అన్యమత ప్రచారాలు ఎక్కువయ్యాయి అంటూ బీజేపీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు జగన్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి క్రైస్తవ సోదరులు సహకరించాలి అంటూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. ఇంతకాలం కుల రాజకీయాల మధ్య నలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు మత రాజకీయాల మాటున నలిగిపోవడానికి సిద్దంగా ఉంది అనేది అర్ధమవుతుంది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…