Telugu

ట్రెండీ యూత్ సినిమాలకు కరువొచ్చి పడిందా?

కేవలం అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా. ఓటిటిలో అందుబాటులో ఉంది. యూత్ ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు. మరీ పెద్ద గ్యాప్ కాదు కాబట్టి దాని తాలూకు థియేటర్ ఎక్స్ పీరియాన్స్ ఇంకా ఫ్రెష్ గానే ఉంటుంది. అయినా సరే ఈ నగరానికి ఏమైందికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ నిర్మాతే కాదు ట్రేడ్ కూడా ఊహించని విధంగా జరుగుతున్నాయి.

కొన్ని చోట్ల కొత్త రిలీజులు స్పై, సామజవరగమన కన్నా వేగంగా ఈ షోలు హౌస్ ఫుల్ కావడం అంతు చిక్కడం లేదు. దెబ్బకు ప్రీమియర్లు పెంచుతున్నారు. ఈ హఠాత్పరిణామం దర్శకుడు తరుణ్ భాస్కర్ ఊహించనిది. ఎందుకంటే జనం ఇప్పుడెంత పొగిడినా ఈ నగరానికి ఏమైంది 2018లో విడుదలైనప్పుడు ఇంత స్పందన రాలేదు. కేవలం ఏ సెంటర్స్ లో మాత్రమే మంచి వసూళ్లు రాబట్టింది.

ADVERTISEMENT

బి,సి సెంటర్ యువతకు సైతం అంతగా కనెక్ట్ కాలేదు. కట్ చేస్తే సురేష్ సంస్థ ఓ మోస్తరు లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే ఒక్క క్లిక్ తో నెట్ ఫ్లిక్స్ లో దొరికే మూవీని వందలు ఖర్చు పెట్టి మరీ ఫ్రెండ్స్ తో చూసేందుకు ఆడియన్స్ రెడీ అవుతున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

ఇక్కడో విషయం స్పష్టం. టాలీవుడ్ లో ట్రెండీ కంటెంట్ కి కరువొచ్చింది. ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలను ఆకట్టుకునేలా రాయడంలో కొత్త జనరేషన్ దర్శక రచయితలు తడబడుతున్నారు. వాళ్లకేం కావాలో పసిగట్టడంలో లెక్క తప్పుతున్నారు. అందుకే మేం ఫేమస్, పరేషాన్ లాంటివి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయాయి.

జాతిరత్నాలుని ఫాలో కాబోయే ఎందరో బొక్క బోర్లా పడ్డారు. తాగుడు తినుడు చూపించినంత మాత్రాన టికెట్లు తెంపే అమాయకత్వంలో యూత్ లేరు. అర్జున్ రెడ్డి లాంటి ఓవర్ అగ్రెసివ్ హీరోయిజంతో పాటు ఈ నగరానికి ఏమైంది లాంటి సింపుల్ సెన్సిబుల్ కాన్సెప్ట్స్ కోసం యువత మొహం వాచిపోయేలా ఎదురు చూస్తోంది.

నువ్వే కావాలి, హ్యాపీ డేస్, 7జి బృందావన్ కాలనీ లాంటి మేజిక్ జరగాలని కోరుకుంటోంది. కానీ తీసేవాళ్ళు ఏరి. అందుకే లాభం లేదని పాతవాటికే మళ్ళీ ఎగబడుతున్నారు. స్నేహితులతో కలిసి థియేటర్ లో చిల్ అవ్వడానికి ఏదైతేనేం అని ఎగబడి టికెట్లు కొంటున్నారు. ఇప్పుడైనా న్యూ జనరేషన్ రైటర్లు కళ్ళు తెరిచి కలం విదిలిస్తే కాసులు బెంజ్ కారు వేసుకొచ్చి మరీ కౌగిలించుకుంటాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nelson – NTR: The Combo Fans Want Now!

After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…

38 minutes ago

Vidya Balan Still Regrets Missing This Iconic Role

Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…

1 hour ago