Telugu

ట్రైలర్ టాక్ – ‘కన్ఫ్యూషన్’ ఎంటర్టైన్మెంట్ గురూ!

టాలీవుడ్ బాక్సాఫీస్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ రాబోతోంది. ఇటీవల కాలంలో కామెడీ చిత్రాల పోకడ తగ్గడంతో ప్రేక్షకులు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడబోతుంటే వీరి కొరతను “ఈడోరకం ఆడోరకం” సినిమా తీర్చేలా కనపడుతోంది. పండుగ నాడు విడుదలైన ధియేటిరికల్ నవ్వులను పంచుతోంది.

నిజానికి ఇలాంటి చిత్రాలకు అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రస్. అయితే ఈ సారి ఆ బాధ్యతలను మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు పోషించారు. ‘కన్ఫ్యూషన్’ డ్రామాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అదే ‘కన్ఫ్యూషన్’ బాటలో ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ స్పష్టం చేసింది. రెండు జోడీల మధ్య నెలకొన్న ‘కన్ఫ్యూషన్’ ప్రేక్షకులకు కామెడీని పండిస్తోంది.

ADVERTISEMENT

సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఎంటర్టైన్మెంట్ పంథాను కొనసాగించడంలో సక్సెస్ అవ్వగా, సందర్భోచితమైన డైలాగ్స్, రాజేంద్రప్రసాద్, రవిబాబు వంటి నటీనటుల హావభావాలు, కామెడీ చిత్రాల దర్శకుడిగా నాగేశ్వరరెడ్డి తన ప్రతిభను మరోసారి చాటినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మరి దీనిని ఫుల్ లెంగ్త్ లో వీక్షించాలంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే!

Share
Published by

Recent Posts

Pics: Aarti Flaunts Hot Curves In Red Saree Look

Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…

13 minutes ago

KCR Is Coming Out of Farmhouse: Is Padayatra His Comeback Plan?

KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…

43 minutes ago