Telugu

ఎలినో ఎఫెక్ట్ గణనాథుడిని కూడా తాకిందా.?

రాష్ట్రంలో ఎలినో ఎఫెక్ట్ ప్రజల పైనే కాదు ఆ దేవదేవుని పై కూడా పడిందా అన్నట్టుగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఎలినో ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం,తాగు నీటికి సాగు నీటికి తీవ్ర కరువు ఏర్పడింది. వర్షాలు లేక రైతులు అల్లాడుతుంటే ఎండలు తాళలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అయితే రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గణేష్ నిమజ్జానికి సైతం నీరు లేక కొన్ని ప్రాంతాలలో ఆ బొజ్జ గణపతి కూడా ఎలినో ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఎలినో దెబ్బకు వర్షాలు లేక అనంతపురం జిల్లాలో నీటి కొరత తీవ్రంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

ఈ కారణంగా సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రంలో చిత్రావతి నదిలో నీరు లేకపోవడంతో సదరు ప్రాంత భక్తులు గణేష్ విగ్రహాలను ఆ ఎండిన నదిలోనే వదిలిపెట్టి వెళుతున్న దృశ్యాలు పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

రాష్ట్రంలో తగిన మోతాదులో వర్షాలు నమోదు కాకపోవడంతో పలు ప్రాంతాలలో నదులు, చెరువులు, కుంటలు, కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీనితో ఎలినో దెబ్బ సాధారణ ప్రజలకే కాదు ఆ ఏకదంతుడికి తప్పలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఒక పక్క ఎలినో ప్రభావం ఇలా ఉంటే మరోపక్క వైసీపీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఇది ప్రభుత్వ వైఫల్యం అని, గణేష్ ఉత్సవాలకు నీటి అవసరం ఉంటుందని తెలిసిన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదంటూ సదరు వీడియో లను తన X లో పోస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Dhurandhar Oscar Shock: Just 4 Votes Despite Rs 3000 Cr?

The Oscar snub has sparked a fresh backlash from sections of the Dhurandhar fanbase after…

7 minutes ago

The Paradise Is About Raw Emotion and Revolution: Srikanth

Nani and director Srikanth Odela have come together for the second time after Dasara for…

13 minutes ago