కవిత అరెస్ట్: బిఆర్ఎస్ పార్టీకి ఇంకా తెలియదా.. ఏంటి చెప్మా!

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 365 రోజులలో ప్రతీరోజూ కూడా తెలంగాణ అంతటా బిఆర్ఎస్ పార్టీ హడావుడి కనిపిస్తూనే ఉండేది. శాసనసభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ హడావుడి అంతా ఇంతా కాదు. కానీ అదంతా గత వైభవం.

ADVERTISEMENT

ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా నిశబ్ధమే. ఎప్పుడూ కోలాహలంగా ఉండే తెలంగాణ భవన్‌లో కూడా ఇప్పుడు పెద్దగా హడావుడి కనిపించడం లేదు.

కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీ పట్టుకుపోగానే తెలంగాణ అగ్నిగుండంలా మారుతుందని, బిఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అటువంటిదేమీ జరుగడం లేదు. అసలు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసిన విషయం తెలియదన్నట్లు అందరూ ‘సైలంట్ మోడ్’లో ఉండిపోయారు.

కూతురుని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ కనీసం నోరు విప్పి ఖండించలేదు. అధినేత పరిస్థితి ఇలా ఉంటే, బిఆర్ఎస్ పార్టీలో నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసేందుకు భయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ మంత్రుల హెచ్చరికలే అందుకు కారణం.

“మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత జైలుకి వెళితే దాంతో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఏమి సంబంధం? ఆమె కోసం ధర్నాలు, ఆందోళనలు చేసుకోవాలనుకుంటే వెళ్ళి ఢిల్లీలో చేసుకోండి. కానీ తెలంగాణలో అల్లర్లు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోము,” అని కాంగ్రెస్‌ మంత్రులు హెచ్చరించారు.

కేసీఆర్‌, కల్వకుంట్ల కవిత కోసం రోడ్లపై ధర్నాలు చేయడం కంటే, అదేదో… కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోతే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందనుకొంటున్నవారు గాంధీ భవన్‌ ముందు క్యూ కడుతున్నారు. కనుక పార్టీలో ఎవరినీ కల్వకుంట్ల కవిత కోసం ధర్నాలు, ఆందోళనలు చేయమని కేసీఆర్‌ కూడా గట్టిగా అడగలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని బహుశః కేసీఆర్‌ కూడా ఊహించి ఉండరేమో?

చివరాఖరుగా బిఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద వికెట్ ఎప్పుడు పడుతుందా?అని అందరూ ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్‌ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు! ఎందుకంటే, ఆయన సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దానిపై ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. అంటే ఆయనకు ఉచ్చు సిద్దం అవుతోందన్న మాట!

కనుక అది మెడకు చుట్టుకోకుండా బయటపడాలంటే ముందు బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటపడి బీజేపీలో చేరాలి! ఆ రోజు ఎప్పుడా… అని అందరూ ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు ఒక్క వికెట్ పడితే, మిగిలిన వికెట్స్ భారత్‌ చేతిలో బాంగ్లాదేశ్ వికెట్స్‌లా అన్నీ టపటపా పడిపోతాయి… రెండు తప్ప. ఆ రెండు వికెట్స్ ఏవో అందరికీ తెలుసుగా!

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…

2 minutes ago

Who Spoiled Allu Arjun’s AA23 Look Test Plans?

Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 has reportedly undergone a change in its promotional plans,…

12 minutes ago