
ఆ షూటింగ్ సందర్భంగా ఒక స్పాట్ బాయ్ మహేష్ బాబు మినరల్ వాటర్ కాకుండా ట్యాప్ వాటర్ ఇచ్చాడట. దానితో మహేష్ బాబు ఫైర్ అయ్యాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్త చాలా సిల్లీ గా అనిపిస్తుంది. ఒక స్టార్ హీరో సెట్ లో ఉన్నదంటే చిత్రబృందమంతా చాలా కేర్ తీసుకుంటుంది. ఇటువంటివి జరిగే ఆస్కారమే లేదు. అలాగే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలకు తమ పనులు అన్నీ చూసుకునే సొంత స్పాట్ బాయ్స్ ఉంటారు. వారి పని హీరో గారికి కావాల్సినవన్నీ టైమ్ కి అందివ్వడమే.
ఇటువంటి తప్పులు జరిగే ఆస్కారమే ఉండదు. మరి పనిగట్టుకుని ఈ నెగటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు? ఇంకో విషయం ఏమిటంటే అల్లు అర్జున్ మీద వచ్చిన వార్త, ఇప్పుడు ఈ వార్త మొదటి సారిగా ఒకే పత్రిక నుండి రావడం. ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ రెండవ షెడ్యూల్ తొందరలో హైదరాబాద్ లో మొదలు కాబోతుంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో మూడు సెట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
In an industry where towering cutouts are usually associated with male stars, Nayanthara is getting…
The team of 418 expressed happiness over the response to the film, with producers Naveen…