
నిన్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మీద ఇండైరెక్టుగా కామెంట్లు చేశారు. కొందరు పదవులు రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, వారు పార్టీ వల్లే ఆ పదవులు వచ్చాయని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు రాబోయే 30 రోజుల్లో పంచాయతీల రూపురేఖలు మార్చేద్దామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ కోసమంటూ పెట్టిన సమావేశానికి ఈటెలకు ఆహ్వానం అందలేదు. ఈటెల రాజేందర్ హైదరాబాద్ లో ఉండి కూడా సమావేశానికి వెళ్ళలేదు.
ఫోన్ వస్తే బయల్దేరదామనే ఉద్దేశంతోనే చేతిలో మొబైల్ పట్టుకుని సాయంత్రం వరకూ ఈటెల ఎదురుచూశారంటూ ఆయన అనుచరులు అంటున్నారు. దీనితో ఈటెలకు ముఖ్యమంత్రి మధ్య అగాధం ఏర్పడింది అనేది స్పష్టం అవుతుంది. దీనితో ఈటెలను సాగనంపడానికి రంగం సిద్ధం అవుతుందా? అనే అనుమానం రాకమానదు. మరోవైపు ఈ నెలలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని సమాచారం. కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే…