
అయితే ఇప్పటికే నాన్న సెంటిమెంట్ తో “సన్నాఫ్ సత్యమూర్తి” విడుదలై బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక చతికిలపడింది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదలైన ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి పేరు నిలబెట్టడం కోసం ఉన్న 300 కోట్ల రూపాయల ఆస్తి మొత్తాన్ని ఇచ్చేసి, ఆ తర్వాత తండ్రి సాయం చేసిన స్థలం విషయమై విలన్ తో గొడవపడి, చివరకు తానూ అనుకున్నది సాధించుకుని ‘శుభం’ కార్డు వేస్తాడు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడడంతో విడుదలకు ముందే దాదాపు 50 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కానీ విడుదలైన తర్వాత ఆ స్థాయి కలెక్షన్స్ ను కొల్లగొట్టడంలో “సన్నాఫ్ సత్యమూర్తి” విఫలమయ్యాడు. సమ్మర్ కావడంతో ఓ మోస్తరు వసూళ్ళు సాధించిన ఈ సినిమాకు 10 నుండి 15 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే సినీ ఇండస్ట్రీలో ‘నాన్న సెంటిమెంట్’ వర్కౌట్ కాలేదని పరిశీలకులు తేల్చేసారు.
అలాంటి ‘నాన్న సెంటిమెంట్’తో భంగపడ్డ మెగా హీరో స్థానంలోకి ప్రస్తుతం నందమూరి హీరో దూకాడు. ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ చేయలేని మాటల ‘మ్యాజిక్’ను సుకుమార్ తన ‘లాజిక్’తో గట్టేక్కిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రీ రిలీజ్ కు ముందు వినిపిస్తున్న టాక్ మరియు ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయాలు “నాన్నకు ప్రేమతో” చిత్రానికి అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు ఆడియో, ధియేటిరికల్ ట్రైలర్ సినిమా విజయంపై మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాయని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో “నాన్నకు ప్రేమతో” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “మెగా” హీరో చేయలేని కార్యాన్ని తమ “నందమూరి” వంశస్తుడు యంగ్ టైగర్ చేసి చూపిస్తారని సోషల్ మీడియాలలో నందమూరి ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…