
ఊరు, పేరు తెలియని “చిన్నారి” వంటి చిన్న సినిమాలను కూడా డబ్బింగ్ రూపంలో తెలుగులోకి తీసుకువస్తున్న తరుణంలో… తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితమైన పృధ్వీరాజ్ వంటి హీరో, ప్రియ ఆనంద్ వంటి తెలుగు హీరోయిన్ ఉండి కూడా ఈ సినిమాపై తెలుగు నిర్మాతల కన్ను పడకపోవడం విశేషమే. బహుశా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే… ఖచ్చితంగా ఈ సినిమా తెలుగునాట సందడి చేయడం ఖాయమన్న నమ్మకాన్ని “ఎజ్రా” ట్రైలర్ కలిగించింది.
హార్రర్ సినిమాల ట్రైలర్స్ చూస్తుంటే… భయం విషయం పక్కన పెడితే, కనీసం చూడాలన్న ఆసక్తిని పెంపొందించకుండా, కామెడీని పండిస్తున్నాయి. కానీ “ఎజ్రా” ట్రైలర్ లో ఫస్ట్ షాట్ అయిన పేపర్ పట్టుకుని నిల్చున్న వ్యక్తి నుండి చివరి షాట్ వరకు ఆసక్తికరంగా సాగింది. నటీనటుల హావభావాలకు తోడు, హార్రర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించే ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విభాగాలు “ఎజ్రా”కు ప్లస్ పాయింట్స్. ఈ నెలలో మలయాళంలో విడుదల కానున్న ఈ సినిమా సక్సెస్ అయితే, తెలుగునాట ప్రత్యక్షం కావడం పెద్ద విషయమేమీ కాదు.
నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…