
ఈ చిత్రం ఇప్పటికే ఆగస్టు 27 విడుదలకు ధృవీకరించబడింది. ఈ సినిమాలో తోడల్లుళ్లు – వెంకటేష్, వరుణ్ తేజ్‌లు తమ సతీమణుల అతిగా చేసే ఖర్చుల కారణంగా పీకల్లోతు అప్పులలో కూరుకుపోతారు. ఆ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఒక హోటల్‌ను నడుపుతారని మనకున్న సమాచారం.
ఈ ప్రక్రియలో వారు ఎదుర్కొంటున్న పరీక్షల ద్వారా కామెడీ జనరేట్ చెయ్యాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ఒరిజినల్ మాదిరిగానే సీక్వెల్ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడిఈ సినిమాతో మరో 100 కోట్ల షేర్ చిత్రాన్ని సాధించగలడేమో చూడాలి.
ఎఫ్2 అప్పట్లో 80 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అనిల్ తరువాతి సినిమా సరిలేరు నీకెవ్వరూ 100 కోట్ల షేర్ రాబట్టింది. తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపుడి ఒకరు. ఎఫ్ 2 అప్పటికి అతని కెరీర్ లో భారీ హిట్. చాలా కాలం తరువాత ఎఫ్2లో వెంకటేష్ కామెడీ ఇరగదీశాడు. కాబట్టి ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ పై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
Ram Gopal Varma has announced his new film Police Company, which is scheduled to hit…
Vijay Deverakonda seems to be going through a disastrous and confusing phase in his career,…