
“ఖుషి సినిమా తరువాత వరుసగా నాలుగు మంచి హిట్లు వచ్చి ఉంటే ఇప్పుడు సినీ పరిశ్రమలో కనిపించేవాడిని కాదని” పవన్ తన మదిలోని భావాన్ని బయట పెట్టడంతో పవన్ నటించిన ఫ్లాప్ సినిమాలకు ప్రాధాన్యత లభించినట్లయ్యింది. పవన్ కు హిట్టు రాకుండా మంచి పనే అయ్యింది, లేదంటే తమ దైవం ఇప్పటికే తమకు దూరంగా జరిగి ఉండేదన్న ఆవేదనను పవర్ స్టార్ ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్నారు.
“నటన అనేది చాలా అలసటైన విషయమని, సినిమాలో ప్రతి సన్నివేశం పక్కాగా ఉండాలని భావించి బాగా ఇన్వాల్వ్ అవుతానని, అందుకే సినిమాల నుంచి విరామం తీసుకోవాలని భావించానని, సినిమాలు చేయకపోతే ‘పవర్’ తగ్గిపోయినా ప్రమాదం లేదని, పవర్ అనేది పుట్టుకతో రాలేదని, అది పోయినంత మాత్రన ఏమీ జరిగిపోదని, జీవితంలో ఏదీ శాశ్వతం కాదని వేదాంతం కూడా వర్ణించారు పవర్ స్టార్. అన్నారు.
ఏది ఉన్నా లేకున్నా అభిమానులతో దూరం పెరగదని, అభిమానుల మధ్యకు వెళ్తానని అన్నారు. సినిమాల్లో నటన నుంచి విరామం తీసుకున్నప్పటికీ సినిమాలతో అనుబంధం మాత్రం కొనసాగుతుందని చెప్పిన పవన్… అది ఏ విధంగానో చెప్పకుండా, మీకే తెలుస్తుందని అంటూ సస్పెన్స్ లో పెట్టారు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో.
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…
Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…